📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓడిఎఫ్ కాలనీలో యోగాభ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓడిఎఫ్ కాలనీలో యోగాభ్యాసం

📰 Generate e-Paper Clip

•అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓడిఎఫ్ కాలనీలో యోగాభ్యాసం•

*శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత యోగ వల్ల సాధ్యం: మురళీకృష్ణ , ఉష

 

అమీన్పూర్, జూన్ 21(ప్రజావాణి):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో యోగా సాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు.

ఈ సందర్భంగా యోగ గురువులు మురళీకృష్ణ, ఉష యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు.

పాల్గొన్న వారందరికీ యోగా ఆసనాలపై అవగాహన కల్పించి, వాటిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సూచనలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని, ప్రతిరోజూ యోగా చేయాలని సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular