•జూలై 2న ఉప్పల్‌లో నిర్వహించే ‘భూ పోరాటం’ను విజయవంతం చేయాలి : తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి
పటాన్‌చెరు, జూన్ 20 (ప్రజావాణి): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న ‘భూ పోరాటం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు.
శనివారం బీరంగూడ కమాన్ వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పిలుపు మేరకు చేపడుతున్న ఈ భూ పోరాటం కేవలం భూముల కోసం మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు తగిన గుర్తింపు, న్యాయం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, అలాగే ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా, కులమత భేదాలకు తావులేకుండా తెలంగాణ ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి వచ్చి భూ పోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 24 నియోజకవర్గాల నుంచి ఉద్యమకారులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రామిగిరి ప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్ దుగుంట్ల నరేష్ ప్రజాపతి, జిల్లా ఇన్‌చార్జ్ మసన్నగారి బాలయ్య, ఉమ్మడి రంగారెడ్డి–మెదక్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, కన్వీనర్ మధుసూదన్, గౌరీ గణేష్, ఉమ్మడి మెదక్ ఇన్‌చార్జ్ వేముల భవాని, శివశంకర్, మడసు శ్రీనివాస్ రావు, గోపి సదానందం, రాంకోటి, అర్జున్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జూలై 2న ఉప్పల్‌లో నిర్వహించే భూ పోరాటం ను విజయవంతం చేయాలి తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి
RELATED ARTICLES

