ఘట్‌కేసర్, జూన్ 19: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై ప్రజలకు, సంబంధిత అధికారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఘట్‌కేసర్ మండలంలోని ఏస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీసర ఆర్డీవో వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో ఘాట్ కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్, ఏఎంసీ శశికాంత్, డీటీ చంద్రశేఖర్ పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియ, విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై వివరించారు.
ఈ సదస్సులో ఆర్‌ఐలు సాయిరామ్, కావ్య, సర్వేయర్ రూప, బీఎల్‌వోలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



