ఎస్ కళాశాలలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు
ఘట్‌కేసర్, జూన్ 19: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై ప్రజలకు, సంబంధిత అధికారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఘట్‌కేసర్ మండలంలోని ఏస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీసర ఆర్డీవో వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఘాట్ కేసర్ తహసీల్దార్...