📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలిరాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం

ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం

📰 Generate e-Paper Clip

ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి…
రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్…
కోదాడ నియోజకవర్గం లో రూ.1938 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాత ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్……
కోదాడ నియోజకవర్గ ప్రజల అండగా, నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిస్వార్థ సేవతో రాజకీయాలకే ఆదర్శంగా ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్…. మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు…
ఎర్నేని ఆధ్వర్యంలో ఘనంగా కోదాడ నియోజకవర్గ  ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ జన్మదిన వేడుకలు..
కోదాడ, జూన్ 17/ ప్రజావాణి : ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలమాద పద్మావతి ఉత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ రెడ్డి రాజకీయ, సామాజిక సేవలను కొనియాడిన ఎర్నేని మాట్లాడుతూ మహిళా నాయకత్వానికి ఆమె నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి ఉత్తమ్ రెడ్డి నిలిచారని తెలిపారు. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆమె ప్రజా ప్రతినిధిగా విశేష గుర్తింపు పొందారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తూ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న నాయకురాలిగా పద్మావతి ఉత్తమ్ రెడ్డి ఎదిగారని కొనియాడారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాల్లో సమాన అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ, నిస్వార్థ సేవతో రాజకీయాలకు ఆదర్శంగా నిలిచిన ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు ,
సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కౌన్సిలర్ లు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, పాశం శ్రీనివాస్, నాగేంద్రమ్మ, కాంగ్రెస్ నాయకులు ఉప్పగండ్ల శ్రీనివాస రావు, రావెళ్ల కృష్ణారావు మైలారి శెట్టి భాస్కర్  మట్టపల్లి సాలయ్య,  కాజా, నెమ్మది దేవమని ప్రకాష్ బాబు, వంటిపులి శ్రీనివాస్, వేమూరి విద్యాసాగర్, గంధం పాండు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.