విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
ప్రజావాణి ప్రతినిధి, బీర్కూర్: బీర్కూర్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పద్మ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఎం. వెంకన్న, ఉపసర్పంచ్ పరమేష్, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శివరాం, ఉపాధ్యాయులు యమా రాములు, మేకల విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సకాలంలో పాఠశాలకు హాజరై విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

