📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర...

మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేరుగా నాగార్జున, పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

అమరావతి జూన్ 15 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం మరియు ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేరుగా నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నార్తులకు ఆహారం వితరణగా అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిరణ్ రాజ్ బందెల మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాలు పోరాటాలు ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశయ సాధన ఉనికిపుచ్చుకొని ఎన్నో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి అనుకూల పరిస్థితులు గా మార్చుకొని దళిత బహుజనల అభివృద్ధి కొరకు వారి హక్కుల కొరకు వారి సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాగార్జున గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే విధంగా వారి సేవలు మరింత విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని కోరుకొన్నారు ఈ సమయంలోనే ఆయన మాట్లాడుతూ అనేక పదవులు అన్ని తెచ్చే విధంగా పూర్వపు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అనేక దాడుల విషయంలో తనదైన శైలిలో స్పందిస్తూ ఎంతోమంది బాధితులకు న్యాయం చేశారు ఆ కోవలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లి శాసన సభ్యులుగా ఎన్నిక కాబడి తదనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారి నేతృత్వంలోనే విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో వారి కృషి మరువలేనిదని కిరణ్ రాజు తెలియజేశారు విగ్రహం ఏర్పాటు నుండి విగ్రహం ఆవిష్కరణ దాకా నిరంతరం శ్రమించి వారి దీక్ష దక్షతను నిరూపించుకున్నారు రాబోయే రోజుల్లో నాగార్జున మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఎప్పుడు దళిత వర్గాల పక్షపాతిక నిలబడాలని చెప్పి కిరణ్ రాజ్ కోరుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.