బెజ్జంకి, జూన్ 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోనీ ఆయా గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ ఆధ్వర్యంలో పాపయ్యపల్లి గ్రామంలో గుండెపోటుతో అకాల మరణం చెందిన బొమ్మిడి రాజు కుటుంబ సభ్యులను, గాగిల్లాపూర్ గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకుడు అన్నాడి మల్లారెడ్డి కుటుంబాన్ని, గూడెం గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో జరిగిన మోసానికి గురై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తాడూరి రుతిక్ రోషన్ కుటుంబ సభ్యులను కలిసి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మనోధైర్యం నింపుతూ, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, గూడెం సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువెరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఒంటెల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్, బోనగం రమేష్, అమరాజు ప్రశాంత్, గాగిల్లాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పైడిపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.




