మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని కరీంనగర్ డెయిరీ పాల కేంద్ర ఎన్నికలపై కొందరు చేసిన ఆరోపణలను పాల కేంద్ర అధ్యక్షులు వర్ణ శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఎన్నికలు పూర్తిగా నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని తెలిపారు.
అధ్యక్షులు వర్ణ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ –
• అధ్యక్ష ఎన్నిక మెజార్టీ సభ్యుల మద్దతుతోనే జరిగిందన్నారు.
• కుల వివక్ష, ఓటు బ్యాంకు రాజకీయాల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
• ఎస్సీ, ఎస్టీ, బీసీతో సహా అన్ని వర్గాల రైతుల అభ్యున్నతికి కరీంనగర్ డెయిరీ కట్టుబడి ఉందన్నారు.
• పాల ఫ్యాట్ పరీక్షలు పూర్తి డిజిటల్ విధానంలో జరుగుతున్నాయని, అవకతవకలకు అవకాశం లేదన్నారు.
• బోనస్ పంపిణీ, ఆర్థిక లావాదేవీలు రైతులకు నేరుగా ఇస్తున్నామన్నారు.
• రికార్డులు క్రమబద్ధంగా నిర్వహిస్తూ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు.
కొంతమంది వ్యక్తిగత స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, పాడి రైతులు వాస్తవాలను గుర్తించి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

