రేకొండ పాల కేంద్రంపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: పాల కేంద్రం అధ్యక్షులు వర్ణ శ్రీనివాస్ రెడ్డి
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని కరీంనగర్ డెయిరీ పాల కేంద్ర ఎన్నికలపై కొందరు చేసిన ఆరోపణలను పాల కేంద్ర అధ్యక్షులు వర్ణ శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఎన్నికలు పూర్తిగా నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని తెలిపారు. అధ్యక్షులు వర్ణ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – • అధ్యక్ష ఎన్నిక మెజార్టీ సభ్యుల మద్దతుతోనే జరిగిందన్నారు. • కుల వివక్ష, ఓటు బ్యాంకు రాజకీయాల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. • ఎస్సీ, ఎస్టీ, బీసీతో సహా అన్ని వర్గాల రైతుల...