📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు వినతి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి...

పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు వినతి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూన్12(ప్రజావాణి) పట్టణంలో భూ సమస్యల పరిష్కార వేదికలో ఒక నెలలో ఒక నియోజకవర్గం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం లోని పలు సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ!ఒకరోజు ఒక నియోజకవర్గం భూ సమస్యల పరిష్కార వేదికలో బద్వేల్ నియోజకవర్గం లోని చనిపోయిన మాజీ సైనిక అధికారి భూపట్టాను భార్య పేరుపై ఆన్లైన్ చేయాలని,అదేవిధంగా బి కోడూరు మండలంలోని ఒక భూ సమస్యపై,పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీ నివాసి షేక్ ఖాదర్ బాషా వికలాంగుల పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,పోరుమామిళ్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య, పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీలోని చెత్త సేకరణ సమస్య, తదితర అంశాలపై కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడమైనదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించి కలెక్టర్ప్ర జల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించడం ఒక మంచి కార్యక్రమమని,ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి విజయవంతం చేయాలని,ప్రజలు తీసుకొచ్చే ప్రతి సమస్యను పరిష్కారం చూపించి నిబద్ధతతో ప్రభుత్వం పని చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆర్డీవో చంద్రమోహన్,డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్,పోరుమామిళ్ల ఎమ్మార్వో విజయ్ కుమార్,అన్ని మండలాల రెవెన్యూ సిబ్బంది తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం నాయకులు చెరుకూరి రవికుమార్,బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిసెట్టి సుప్రజా,పోరుమామిళ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ చైర్మన్ చెన్నారాయుడు కలసపాడు పామూరు బాలిరెడ్డి,సిఐ హేమ సుందర్,పోరుమామిళ్ల మండల పార్టీ అధ్యక్షుడు అన్వర్,బి.కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు గుర్రప్ప,బద్వేల్ పట్టణ అధ్యక్షులు నరసింహ,బద్వేల్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,జవహర్ బాలమంచ్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు భాష, సిద్దు, నాయబ్ రసూల్,రంతుల్లా,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.