ఎండపల్లి మండల వ్యాప్తంగా ఈరోజు ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ అకాల వర్షం భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ఎండవేడిమి నుండి ఊరట లభించడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు కూడా ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం వల్ల మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరగా, వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
ఎండపల్లిలో వర్షం: ఉపశమనం పొందిన ప్రజలు
0
38
Previous article
- Advertisment -



