📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తల్లికి వందనం స్కీం జూన్ లో కాదు

తల్లికి వందనం స్కీం జూన్ లో కాదు

📰 Generate e-Paper Clip

అమరావతి జూన్ 10 ప్రజావాణి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నగదును జూలైలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 12న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.13,000 జమ చేస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది నిధుల విడుదల కొంచెం ఆలస్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లులకు ఏటా రూ.13,000 అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది లబ్ధిదారులు 68 లక్షల మంది ఉన్నారు. పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటున్నప్పటికీ, నిధులు వచ్చే నెల మొదటి వారంలోనే అందుబాటులోకి వస్తాయి ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం ఒక కీలకమైన పథకంగా నిలుస్తోంది. పిల్లలు ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకోవడానికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా డ్రాపవుట్స్‌ తగ్గిస్తుంది. అర్హత కోసం కొన్ని ఆదాయ పరిమితులు ఉండాలి. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానించబడి ఉండటం కూడా తప్పనిసరి. తల్లికి వందనం పథకానికి అర్హతలు ఏమిటి?
ఈ పథకం పొందాలంటే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి నెలవారీ ఆదాయం రూ.10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 లోపు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా రైస్ కార్డు ఉండాలి. మూడు ఎకరాల కంటే తక్కువ తడి భూమి లేదా రెండు ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి లేదా కలిపి పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు అర్హులు. అలాగే గత 12 నెలల్లో నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి.ఈ పథకం పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా, అర్హత ఉన్న ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోయినా, ఆ నగదును తండ్రి లేదా సంరక్షకుని ఖాతాలో జమ చేస్తారు.ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రయోజనాలు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా ప్రయోజనం అందిస్తోంది. పాఠశాల లేదా కాలేజీలో చేరిన ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలోని ‘అమ్మఒడి’ పథకానికి దీనికి ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే, అమ్మఒడిలో ఒకే బిడ్డకు మాత్రమే సాయం అందుతుండేది. కానీ ఇప్పుడు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ సాయం అందుతుంది. మొత్తం రూ.15,000 లలో రూ.2,000లను విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం కేటాయించి, మిగిలిన రూ.13,000లను నేరుగా తల్లి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.