📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriభార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్ జూన్ 7: ఘాట్ కేసర్ లోని కొండాపూర్ లో భార్య తో గొడవపడి కొంతకాలంగా సోదరుడి వద్ద నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు మేఘావత్ శ్రీను తెలిపిన మేరకు అతని సొంత అన్న మేఘావత్ మోతీలాల్ (41) సుమారు ఎనిమిది నెలల క్రితం భార్యతో విభేదాల కారణంగా కొండాపూర్‌లోని తన సోదరుడు శ్రీను ఇంటికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు.

ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో తన తల్లికి కిరాణా దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన మోతీలాల్ తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, పరిచయస్తుల వద్ద గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular