కన్నెపల్లిలో పర్యావరణ దినోత్సవం నిర్వహణ
కౌటాల, ప్రజావాణి జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, గ్రామ పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని గ్రామస్థులకు సూచించారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి, ఉప సర్పంచ్ మోర్లె సమత, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




