📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకృతి రక్షణే నిజమైన అభివృద్ధి – సీతానగరం ఘాట్‌ వద్ద పర్యావరణ కార్యక్రమం,• ప్రకృతి సంరక్షణ...

ప్రకృతి రక్షణే నిజమైన అభివృద్ధి – సీతానగరం ఘాట్‌ వద్ద పర్యావరణ కార్యక్రమం,• ప్రకృతి సంరక్షణ దిశగా నగర పాలక సంస్థ ముందడుగు

📰 Generate e-Paper Clip

మంగళగిరి తాడేపల్లి జూన్ 5 ప్రజావాణి  నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ (MTMC) ఆధ్వర్యంలో సీతానగరం ఘాట్ వద్ద గల ఫిషరీస్ పాయింట్ వద్ద ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడినది.పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, పట్టణాన్ని మరింత హరితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ MKVశ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ అలీం బాషా గారు పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ MKV శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వ విభాగాలు మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. నగర హరితాభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ఫలితాలు సాధించగలము” అని పేర్కొన్నారు. అలాగే పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రీనింగ్‌ను ప్రధాన భాగంగా తీసుకోవాలని సూచించారు. మంగళగిరిలో 34% గా ఉన్న పచ్చదనాన్ని రానున్న రోజుల్లో 50 శాతానికి పెంచేందుకు కార్పొరేషన్ అధికారులు కృషి చేయటం అభినందనీయం అన్నారు.అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ అలీం బాషా గారు మాట్లాడుతూ, “మంగళగిరి తాడేపల్లి నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం. మొక్కలు నాటడం ఒక రోజు కార్యక్రమం కాకుండా నిరంతర ఉద్యమంగా కొనసాగాలి. ప్రతి పౌరుడు తన పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. అలాగే డ్రైన్లలో చెత్త వేయకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలి” అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సుస్థిర పర్యావరణ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గత రెండు సంవత్సరాలలో 23 వేల మొక్కలను నియోజకవర్గ పరిధిలో నాటినట్లు ,మొక్కలు నాటటం చెరువులను అభివృద్ధి చేసుకోవడం వంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు అయితేనే నగర పాలక సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.చివరిగా డిప్యూటీ కమిషనర్ శ్రీ బి. శ్రీకాంత్ గారు, నగర పాలక సంస్థ సిబ్బందిక పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించి పాల్గొన్న వారితో సచ్చ్చాంద్ర హరిత ప్రతిజ్ఞ చేయించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీ బి. శ్రీకాంత్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీనివాస్ రావు,సెక్రెటరీ శ్రీనివాసరావు ,మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మల్లిక,ఉద్యాన అధికారి రామారావు, తాడేపల్లి టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ధారాదాసు, బుద్ధుండి నాగేశ్వరరావు, మరియు జనసేన పట్టణ అద్యక్షులు అంబటి తిరువతి రావు, బిజెపి నాయకులు నగరపాలక సంస్థ సిబ్బంది,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular