ప్రకృతి రక్షణే నిజమైన అభివృద్ధి – సీతానగరం ఘాట్‌ వద్ద పర్యావరణ కార్యక్రమం,• ప్రకృతి సంరక్షణ దిశగా నగర పాలక సంస్థ ముందడుగు

మంగళగిరి తాడేపల్లి జూన్ 5 ప్రజావాణి  నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ (MTMC) ఆధ్వర్యంలో సీతానగరం ఘాట్ వద్ద గల ఫిషరీస్ పాయింట్ వద్ద ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడినది.పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, పట్టణాన్ని మరింత హరితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ MKVశ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....