📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవానాకాలం సాగుపై రైతులకు అవగాహన- -రైతులకు సూచనలు చేసిన ఏఈఓ తేజస్విని

వానాకాలం సాగుపై రైతులకు అవగాహన- -రైతులకు సూచనలు చేసిన ఏఈఓ తేజస్విని

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వానాకాలం పంటల సాగు విధానాలు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఎరువుల సమతుల్య వినియోగం, పంటల సంరక్షణ చర్యలు, చీడపీడల నివారణ పద్ధతులపై వివరంగా అవగాహన కల్పించారు.వ్యవసాయ అధికారి ఏఈఓ తేజస్విని మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టి నష్టాలను తగ్గించుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular