📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనకు రెండేళ్లు,,ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం,,...

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనకు రెండేళ్లు,,ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం,, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ,

📰 Generate e-Paper Clip

బద్వేల్ జూన్ 3 ప్రజావాణి ఎన్నికల సమయంలో ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు,కాశినాయన,బి.కోడూరు,పోరుమామిళ్ల మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోరుమామిళ్లలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.బస్టాండ్ కూడలిలో భారీ నిరసన మరియు అంబేద్కర్ సర్కిల్లో–హామీ పత్రాల దహనం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు బస్టాండ్ కూడలిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల సమయంలో ప్రజలకు చూపించిన మేనిఫెస్టోతో పాటు“బాబు షూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ” పేరుతో ఇచ్చిన హామీ పత్రాలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మర్చిపోయిన ప్రభుత్వం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక భరోసా,రైతు సంక్షేమం,సామాజిక పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాల నిలిపివేత–కొత్త హామీలకూ నోచుకోని ప్రజలు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేయడంతో పాటు,కొత్తగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని నాయకులు మండిపడ్డారు.ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎలాంటి సంబంధం లేదని,ఇది ప్రజల విశ్వాసానికి చేసిన రాజకీయ ద్రోహం మరియు వెన్నుపోటు అని పేర్కొన్నారు.ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుంది ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తూ,ఇచ్చిన ప్రతి హామీ అమలు అయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా,మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు,పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు,జడ్పీటీసీలు,మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.