📄 ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetకోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంజాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే...

కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే సురేష్

📰 Generate e-Paper Clip

కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..
జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే. సురేష్.
కోదాడ, జూన్ 02/ ప్రజావాణి
కోదాడ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చట్టసభలతో పాటు న్యాయవ్యవస్థలోనూ తెలంగాణ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, ఫస్ట్ ఏడీఎం జడ్జి మహమ్మద్ ఉమర్ , సెకండ్ ఏడీఎం జడ్జి జాకియా సుల్తానాలతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు నాగార్జున,వెంకట్రావు, పి. పి సిలివేరు వెంకటేశ్వర్లు, ఏ జి పి సంపేట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular