📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్మార్ట్ పోలీసింగ్ తో రాష్ట్రంలోనే అగ్రగామిగా జిల్లాను నిలిపేందుకు కృషి చేయాలి, రౌడీ లు,అసాంఘిక శక్తులపై...

స్మార్ట్ పోలీసింగ్ తో రాష్ట్రంలోనే అగ్రగామిగా జిల్లాను నిలిపేందుకు కృషి చేయాలి, రౌడీ లు,అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి.కడప జిల్లా ఎస్.పి

📰 Generate e-Paper Clip

కడప (మే30 ప్రజావాణి) స్మార్ట్ పోలీసింగ్ ఇండికేటర్స్ అయిన, ఈ-సాక్ష్య,సి.సి.టి.ఎన్.ఎస్,ఈ- సమ్మన్స్ తదితర మాడ్యూల్స్ పై పట్టు పెంచుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా నిలిపేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు సూచించారు.శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి స్మార్ట్ పోలీసింగ్ పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి సంబంధిత నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జిల్లా ఎస్.పీ స్మార్ట్ పోలీసింగ్ మాడ్యూళ్ళపై సమీక్ష నిర్వహించారు. ఈ- ఆఫీస్ ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఎస్.పి,ఆదేశించారు.డ్రోన్ టెక్నాలజీ ని వినియోగించి నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను(బ్లాక్ స్పాట్స్) గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్ అండ్ బి ఇతర శాఖల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలుపుల వద్ద అతి వేగం,వేగ నియంత్రణ లేకపోవడం వల్ల అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని జిల్లా ఎస్.పి,ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,నిరంతరం నిఘా ఉంచాలన్నారు.రౌడీ లపై ఉక్కుపాదం మోపాలని,రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు.పదే పదే నేరాలకు పాల్పడే వారిపై P.D యాక్ట్ తో పాటు జిల్లా బహిష్కరణ కు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.లాడ్జి లలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు.పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలని,విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని,త్వరితగతిన ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యుల కు అప్పగించాలని ఆదేశించారు.పెండింగ్ లో ఉన్న గ్రేవ్,నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసారు.త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.దొంగతనాలు జరగకుండా రాత్రి,పగలు గస్తీ ముమ్మరంగా చేయాలని ఆదేశించారు.గతంలో జరిగిన ప్రాపర్టీ నేరాలలో సొత్తు రికవరీ చేయాలని,రికవరీ శాతం పెంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.మహిళలపై నేరాలు జరగకుండా శక్తి టీముల నిఘా పెంచాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు,రాజంపేట ఏ.ఎస్.పి మనోజ్ రామనాథ్ హెగ్డే, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి శ్రీ ఎన్.సుధాకర్,ఇంచార్జ్ డి.ఎస్.పి శ్రీ ఇ.బాలస్వామి రెడ్డి,జమ్మలమడుగు డి.ఎస్.పి శ్రీ కె.వెంకటేశ్వర రావు,ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి విబు కృష్ణ ఐ.పి.ఎస్,పులివెందుల డి.ఎస్.పి శ్రీ బి.మురళి నాయక్,మైదుకూరు డి.ఎస్.పి శ్రీ జి.రాజేంద్రప్రసాద్,సి.ఐ లు,ఎస్.ఐ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.