📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialమండలంలో అందుబాటులో పచ్చిరొట్టె ఎరువులు

మండలంలో అందుబాటులో పచ్చిరొట్టె ఎరువులు

📰 Generate e-Paper Clip

సద్వినియోగం చేసుకోవాలన్న ఏఓ మహేష్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 25 (ప్రజావాణి):

ప్రస్తుత వానాకాలం సీజన్‌ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఎండపల్లి వ్యవసాయ అధికారి (ఏఓ) మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ఎండపల్లి ప్యాక్స్, రాజరాంపల్లి ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలలో ఈ విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీలుగ 30 కిలోల బ్యాగు ధర రూ. 2,452/-, జనుము 40 కిలోల బ్యాగు ధర రూ. 3,110/- లతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టా దార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకురావాల్సి ఉంటుందని వివరించారు. సాధారణంగా ఒక 30 కేజీల జీలుగ బ్యాగు విత్తనాలు రెండున్నర నుండి మూడు ఎకరాల పొలానికి సరిపోతాయని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి మహేష్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular