📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaకౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్

కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్

📰 Generate e-Paper Clip

*కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 Days Action Plan) కార్యక్రమములో భాగంగా శుక్రవారం అనగా తేది: 22.05.2026 న ఉదయం: 10:00 గంటలకు స్థానిక PR గెస్ట్ హౌస్ నందు మెప్మా అద్వర్యంలో “కౌమార బాలికలు(15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు)” హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చైర్ పర్సన్ హెల్త్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా కమీషనర్ మాట్లాడుతూ మానవ వికాస దశల్లో కౌమార దశ అతి ముఖ్యమైనదని, శారీరక మానసిక మార్పులు జరిగే దశగా చెప్పటమైంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని పేర్కొనటమైంది. అలాగే వైస్ చైర్ పర్సన్, తెలుకుంట్ల రాజకుమారి, కటకం రమేష్ తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము కు చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, కొన్రెడ్డి మధు, కటకం రమేష్, డా. రాజు, డా. జెస్సి, మెప్మా TMC ఎన్. సరిత, ANM, ఆశా వర్కర్లు మరియు RPలు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.