📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఎమ్మార్వో ఆఫీసులో ‘నయా’ పెత్తందారుడు: విఆర్ఓ భర్త హల్చల్!

వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి) పోరుమామిళ్ల ప్రభుత్వ నిబంధనలు,కార్యాలయ మర్యాదలను తుంగలో తొక్కుతూ ఒక మండల రెవెన్యూ కార్యాలయం (MRO Office) లో ఓ విఆర్ఓ భర్త సాగిస్తున్న పెత్తనం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్య ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకుని సదరు భర్త ఆఫీసులో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బాధ్యత లేని చోట ‘బాస్’ అవతారం:?విశ్వసనీయ సమాచారం ప్రకారం.ఆ మండలంలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా అధికారి భర్త, రోజూ ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. కార్యాలయ సిబ్బందితో ఫైళ్లను పరిశీలించడం,సామాన్య ప్రజల నుండి వచ్చే అర్జీలను తానే స్వయంగా డీల్ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ జీతం భార్యకు వస్తుంటే.ఆ సీట్లో కూర్చుని పెత్తనం మాత్రం భర్త చెలాయిస్తున్నాడని కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల మౌనం.. వెనుక ఉన్న మర్మమేంటి? కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రమేయం లేకుండా అక్కడ ఏ ఫైలు ముందుకు కదలడం లేదని, దళారీ వ్యవస్థను మించి ఇతని వేధింపులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.పని ఏదైనా.. రేటు ఫిక్స్! భూమి సర్వేలు,పట్టాదార్ పాస్ పుస్తకాలు,వారసత్వ ధృవీకరణ పత్రాలు (Mutation) లేదా ఇతర రెవెన్యూ పనుల కోసం ఆఫీసుకు వచ్చే అమాయక ప్రజలను సదరు వ్యక్తి టార్గెట్ చేస్తున్నాడు.భార్య సంతకం పెట్టాలన్నా,ఫైలు ఎమ్మార్వో టేబుల్ పైకి వెళ్లాలన్నా ఇతనికి ‘మామూళ్లు’సమర్పించుకోవాల్సిందేనని బాధితులు ఆరోపిస్తున్నారు.లంచం ఇవ్వని వారి ఫైళ్లను నెలల తరబడి పక్కన పడేస్తూ,కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది.చర్యలు తీసుకోవాలని డిమాండ్:మండల రెవెన్యూ కార్యాలయంలో విఆర్ఓ భర్త సాగిస్తున్న అక్రమ వసూళ్లు,అవినీతి దందా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.భార్య ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని,ఆఫీసులోనే తిష్టవేసి సామాన్య ప్రజల నుండి వేల రూపాయల లంచాలు గుంజుతున్నట్లు నమ్మదగిన సమాచారం.కలెక్టర్ స్పందించాలి:ప్రభుత్వ కార్యాలయాన్ని సొంత వ్యాపార సంస్థలా మార్చేసి,దళారీగా అవతారమెత్తిన ఈ ప్రైవేట్ వ్యక్తిపై ఏసీబీ (ACB) మరియు జిల్లా కలెక్టర్  ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. మిగతా వివరాలు రేపటి సంచికలో మీ ప్రజావాణి లో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.