📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే21 ప్రజావాణి)  కాసినాయన మండలం బాలమ్మ సత్రంలో అనాధాశ్రమంలో గురువారం బెంగళూరుకు చెందిన కొండవీటి రాజా రమేష్, అంబిక కుమార్తె చరణ్య పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి శ్రీనివాసులు, వై. పోలయ్య, భాస్కర్ రెడ్డి, ఓబయ్య మాట్లాడుతూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న సంపాదించిన సంపదలో సంతోషం ఉండదని మనం సంపాదించిన వాటిలో వృద్ధులకు, పేదలకు అన్నదానానికి సహకారం అందించినప్పుడు వచ్చే ఆనందం మరి ఎందులోనూ ఉండదని పేర్కొన్నారు. ఎవరు లేని అవ్వ తాతలకు మనము ఉన్నామని భరోసా కల్పించి మన పుట్టినరోజు వేడుకల్లో, శుభకార్యాలలో ఆరోజు వారికి పలకరించి భోజనానికి వారితో పాటు మనం పాల్గొనడంలో ఉన్న సంతోషం మరి ఎందులో లేదన్నారు. అనంతరం రాజా రమేష్, అంబిక కుమార్తె చరణ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అవ్వ తాతలకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అవ్వ తాతలు మాట్లాడుతూ దాతలు మాకు మంచి ఇందు భోజనం ఏర్పాటు చేసిన శరణ్య నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలోబాలమ్మ సత్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.