📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్క్రైస్తవ పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి అమానుషం... mrps రాష్ట్ర నాయకులు పానుగంటి...

క్రైస్తవ పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి అమానుషం… mrps రాష్ట్ర నాయకులు పానుగంటి షాలేంరాజ్.

📰 Generate e-Paper Clip

అల్లూరి సీతారామరాజు జిల్లా మే19 ప్రజావాణి చింతపల్లి గిరిజన ప్రాంతం పాడేరు నియోజకవర్గంలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ముమ్మాటికి మనువాద సనాతన ధర్మ పరిరక్షకుల దాడి అనే దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై మరియు ప్రభుత్వంపై ఉందని ఎమ్మార్పీఎస్ నాయకులు పానుగంటి షాలెంరాజ్ నేదరపల్లి జయరాజ్ దోషులను ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాస్టర్ అభినయ్ దర్శన్ కేవలం సువార్తే కాకుండా అనేక విధాలుగా గిరిజన ప్రాంతాలలో సేవ చేస్తూ గిరిజనులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడుతున్న వ్యక్తి అని గిరిజనులను చైతన్యం చేసే క్రమంలో భాగంగా పాడేరు నియోజకవర్గం లో అనేక ప్రాంతాలలో పాదయాత్ర ద్వారా గిరిజనులను చైతన్యం చేసే విధానాన్ని జీర్ణించుకోలేక కొంతమంది మతతత్వవాదులు ఒక పథకం ప్రకారం అభినయ్ దర్శన్ పై హత్యాయత్నాన్ని రచించారని గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటన మరువక ముందే తిరిగి అభినయ్ హత్య ప్రయత్నం క్రైస్తవులపై దాడులు మరియు చర్చిలను కూలగొట్టడం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువయ్యాయని అందుకు ప్రధాన కారణం గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.మతవిద్వేషాలకు ప్రధాన కారకులు డిప్యూటీ స్పీకర్ అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ను మరో మణిపూర్ గా మార్చేందుకు బీజేపీ కూటమి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు ఇదే విధంగా పరిపాలన కొనసాగితే రాబోయే ఎన్నికల్లో దళిత క్రైస్తవులు మైనారిటీ ప్రజలు ఏకమై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు పాస్టర్ అభినయ్ దర్శన్ హత్యాకాండ కు ప్రయత్నించిన దోచులను కఠినంగా శిక్షించాలని వారు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  రాష్ట్ర నాయకులు పానుగంటి షాలేంరాజ్,నేదరపల్లి జయరాజ్,గోనమోహన్రావు,శ్రీకాంత్,ప్రభాకర్,ఆనంద్, క్రాంతి,ప్రవీణ్,వినోద్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.