📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ నంద్యాలలో భారీ శాంతియుత ర్యాలీ...వైసీపీ

పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ నంద్యాలలో భారీ శాంతియుత ర్యాలీ…వైసీపీ

📰 Generate e-Paper Clip

నంద్యాల (మే 17 ప్రజావాణి) నూనెపల్లె ఉదయానంద రెసిడెన్సి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ర్యాలీ సాగింది,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసిపి శ్రేణులు సమరశంఖం పూరించాయి.నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.అధికారంలోకి వచ్చాక ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వైసిపి తీవ్రంగా ఖండించింది.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, వైసిపి సిఇసి సభ్యులు పీపీ నాగిరెడ్డితో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న పి జి ఆర్ ఎస్ (PGRS) లో డిఆర్ఓ రాము నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో తామే అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.పెరిగిన ధరల నియంత్రణపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై 31 శాతం వ్యాట్ భారాన్ని మోపుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రోడ్ డెవలప్మెంట్ టాక్స్ పేరుతో రకరకాల పన్నులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం రాష్ట్ర ఖజానా నింపుకోవడానికే తప్ప.. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కాదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు సుంకాన్ని తగ్గించాలని, రూపాయి భారం కూడా లేకుండా ప్రజలకు ఉపశమనం కలిగించాలని” వైసిపి నేతలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో.మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీ సా,రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డా. శశికళ రెడ్డి, కల్లూరి రామ లింగా రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లు విజయ శేఖర్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసిపి నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవ నగర్ భాష, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ , సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవి రమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి శంకర్ నాయక్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు వైసిపి మాజీ కౌన్సిలర్లు మండల స్థాయి నాయకులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.