📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దీర్ఘకాలిక కలను సాకారం చేసిన వైయస్ జగన్.వైయస్సార్ సిపి రాష్ట్ర...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దీర్ఘకాలిక కలను సాకారం చేసిన వైయస్ జగన్.వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ధ్వజం.

📰 Generate e-Paper Clip

కడప (మే 17 ప్రజావాణి) నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ ఆర్టీసీ ప్రైవేటీకరణలో భాగంగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర.ఆర్టీసీ ఉద్యోగులు ,కార్మికులకు వైయస్ జగన్ అండ.ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.చంద్రబాబు సర్కార్ పై ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ధ్వజం.ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైఎస్ జగన్ సర్కార్ ఆర్టిసి ఉద్యోగుల, కార్మికులను ప్రగతి బాట పట్టించి అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారిని ఆదుకుందని, ఇది ఆర్టీసీ చరిత్రలో స్వర్ణ యుగమని ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కొనియాడారు.  ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాక, ప్రతి నెల జీతాల కోసం జగన్ సర్కార్ రూ. 360 కోట్లు కేటాయించి వారిని ఆదుకుందని, ఆర్టీసీకి ఉన్న రూ. 8000 కోట్ల అప్పుల్లో రూ. 5000 కోట్లు చెల్లించి, 1500 బస్సులను రీ మోడలింగ్ చేసి ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల దీర్ఘకాలిక కలను సాకారం చేసిన మహోన్నత వ్యక్తి జగన్ అని, చంద్రబాబు సర్కార్ వచ్చి రెండేళ్లయినా ఇంకా వైఎస్ జగన్ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారని ఆయన విశదీకరించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ద్వారా చంద్రబాబు సర్కార్ చెప్పించి ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని ఇది ఆర్టీసీ చరిత్రలో బ్లాక్ డే అని ఆయన ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు వలననే ఆర్టీసీ సంక నాకి పోయిందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ అంటున్నారని… సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచలేక రాష్ట్రం దివాలా తీసిందని అంటూ రాష్ట్రాన్ని అమ్మేస్తారేమోనని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.ఆర్టీసీ బస్ స్టేషన్లు డిపోల రూపంలో ఉన్న, ఆర్టీసీకి వెన్నముక్కగా ఉన్న భూములను కడప, కర్నూల్ తో పాటు మరో పది డిపోలను ప్రైవేటు సంస్థలకు 2026 ఫిబ్రవరిలో కట్టబెట్టిందని వాటి విలువ రూ. 6000 కోట్లని ఆయన వివరించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు దానిని ప్రవేటు, కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు పగడ్బందీ వ్యూహంతో కుట్రలు చేస్తోందన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ఈ- బస్సులను ఆర్టీసీ నిర్వహించాలన్న డిమాండ్లు కాదని ప్రవేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని, కొత్త డీజిల్ బస్సులను సైతం కొనకుండా ప్రభుత్వమే ఆపిందని, గత ఆరు నెలలుగా కాలం చెల్లిన 264 బస్సులను సర్వీసుల నుండి తొలగించిందని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 8000 పోస్టులను ప్రభుత్వపరంగా భర్తీ చేయడం లేదని, ఇలాంటి నీచ ఎత్తుగడలతో చంద్రబాబు సర్కార్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ఎత్తులు వేస్తూ కుట్రలు పన్నుతోందన్నారు. అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థను కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తోందన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను వైయస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు జగనన్న అండగా ఉంటారని ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికైనా ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోకపోతే చంద్రబాబు సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నేతలు వైయస్సార్ సిపి, బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్, గోటూరు ఎంపీటీసీ సోమల రామకృష్ణారెడ్డి, ఆర్ట్స్ కాలేజీ మాజీ చైర్మన్, వైయస్సార్ సిపి మండల నేత మద్దిక నాగేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.