📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మంచి ఆలోచనతో అడుగేయాలి..నిధులకు కొరత లేదు.*జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

మంచి ఆలోచనతో అడుగేయాలి..నిధులకు కొరత లేదు.*జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్  మైదుకూరు,జలధార జల హారతి -సాగునీటి సంరక్షణ” లో భాగంగా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె శెట్టివారిపల్లె చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం మంచి ఆలోచన,చక్కటి ప్రణాళికతో అడుగు ముందుకేయాలే గానీ.. జిల్లాలో అభివృద్ధి పనులకు ఏ మాత్రం నిధుల కొరత లేదని. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.శుక్రవారం “జలధార జల హారతి – సాగునీటి సంరక్షణ”లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తోకలిసి మైదుకూరు మండలం శెట్టివారిపల్లె చెరువుకు నీరందించే పనులకు జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గ్రామసభలో వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జలమే సంపద. దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చన్నారు. నీరు మనందరికీ సర్వస్వమని, నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.చెరువుల పునరుద్ధరణ,నీటి సంరక్షణ,భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేయపట్టడం జరుగుతోందన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని.నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామపంచాయతీలు,ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలన్నారు.ఇప్పటికే అన్ని మండలాల్లో చక్కటి ప్రణాళికలతో జలాధార కార్యక్రమం ద్వారా. భూగర్భజలాలను సంరక్షించి.సాగునీటి కొరతను తీర్చే పనులుజరుగుతున్నాయన్నారు.జలాధార కార్యక్రమంలో భాగంగా.ముదిరెడ్డిపల్లె అభివృద్ధికి రణాళికలు సిద్ధం చేయడంతో అటు.శెట్టివారిపల్లె చెరువుకు ఎస్.ఆర్. 1,2 కాలువల అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చెరువుకు నీరందితే ఆయకట్టు ప్రాంత రైతులకు ఎలాంటి సాగునీటి కష్టాలు వుండవన్నారు.రైతు ఆలోచనా విధానంలో మార్పు రావాలని సూచించారు. రైతు ఆలోచనలో మార్పు వస్తేనే లాభాల బాటలో నడవగలడన్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ.ఆదాయంలో స్థిరత్వాన్ని అందించేవి ఉద్యాన పంటలే అన్నారు. అధిక తక్కువ నీటి ఖర్చుతో అధిక దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటల సాగుపై మొగ్గుచూపాలన్నారు.విద్యా విషయానికి వస్తే.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా చక్కటి ఫలితాలను అందిస్తున్నాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాలు అత్యున్నతమైన విద్యనందిస్తూ విద్యార్థులు బంగారు భవిష్యత్తులకు బాటలు వేస్తున్నాయన్నారు.కార్పొరేట్ పాఠశాలల్లో అధిక డబ్బులు వెచ్చించి నష్టపోకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో గ్రామానికి చెందిన ఉదయశ్రీ జిల్లాలో ద్వితీయ స్థానం సంపాదించి జిల్లాకే గర్వకారణంగా నిలవడం అభినందనీయమన్నారు. ఇలాంటి విద్యా రత్నాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు.మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.జిల్లా కలెక్టర్ వారి సూచనలు జిల్లాకు చక్కటిసీజన్లకు అనుగుణంగా,కాలానికి అనుగుణంగా పంటలను మార్పు చేసుకోవాలన్నారు.చెరువులు గ్రామాల సహజ సంపద అని.చెరువులలో నీరు గ్రామంలో ప్రతి ఒక్కరి స్థిరఆస్తి అన్నారు.ప్రతి గ్రామంలోను రైతులు, వారి జలఆధారం, వారి పంటల సాగు,నీటి వినియోగంపై దృష్టి సారించాలన్నారు.ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో చేపట్టే ప్రతి అభివృద్ది కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.జిల్లాలో వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం ఆయన ప్రత్యేకత అన్నారు. జిల్లాలో చేయపట్టిన స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు రాష్ట్రములోని కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.మన ప్రాంతంలో చెరువులు,సాగునీటి కాలువలు తదితర అన్ని రకాల ఇరిగేషన్ పనుల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుందన్నారు.  కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానం సంపాదించిన శెట్టి వారి పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని జిల్లా కలెక్టర్ సత్కరించారు.అంతకుముందు ముదిరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మించిన రామలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, ముడైరెడ్డిపల్లె చెరువును పరిశీలించి చెరువులో అభివృద్ధికి సంబంధించి పనుల ప్రణాళికల గురించి అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్,డ్వామా,డీఆర్డీఏ పిడీలు అదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, స్థానిక నాయకులు, సాగునీటి సంఘాల సభ్యులు, ఇరిగేషన్ అధికారులు,మరియు పెద్ద సంఖ్యలో రైతులు,పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular