📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మూల్యాంకన విధుల పారితోషికం చెల్లింపులో జాప్యం తగదు. -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ విమర్శ.

మూల్యాంకన విధుల పారితోషికం చెల్లింపులో జాప్యం తగదు. -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ విమర్శ.

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11)  పదవ తరగతి పరీక్షలు,మూల్యాంకన విధుల నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించడంలో జాప్యం తగదని,తక్షణమే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు డిమాండ్ చేశారు.సోమవారం ఉదయం కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఇఓ షేక్ శంషుద్దీన్ ను కలిసి యుటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు,మూల్యాంకనం పూర్తయి రెండు మాసాలు కావస్తున్నా,పరీక్షల విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు,ఇన్విజిలేటర్స్ కు అలాగే మూల్యాంకన విధులు నిర్వహించిన చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్లకు చెల్లించాల్సిన పారితోషికాన్ని చెల్లించకపోవడం తగదన్నారు. ఉపాధ్యాయులు వేసవి తీవ్రతను ఎదుర్కొంటూ సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి విధులు నిర్వహించినప్పటికీ వారికి చెల్లించాల్సిన పారితోషికాన్ని సకాలంలో చెల్లించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయినప్పటికీ పారితోషికం చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పదవ తరగతి విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించారని పేర్కొన్నారు.కడప జిల్లాలో మాత్రం చెల్లింపులు లేవన్నారు.అలాగే గత ఏడాది పదవ తరగతి పరీక్షా విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంటల్ అధికారులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పారితోషికాన్ని చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖాధికారి స్పందించి తక్షణం చెల్లింపులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి విడుదలైన బడ్జెట్ మేరకు తక్షణమే ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని,రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని,గత ఏడాదికి సంబంధించిన పరీక్షా విధుల పారితోషికం చెల్లింపుకు సంబంధించి బడ్జెట్ కొరకు ప్రభుత్వానికి లేఖ రాశామని,నిధులు రాగానే వాటిని కూడా చెల్లిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ,ఎస్.ఎజాస్ అహ్మద్,ఎ.డి.దేవదత్తం,జె.వి.సుబ్బారెడ్డి, ఎస్.మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.