📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పట్టణంలో మితిమీరుతున్న దొంగతనాలు, పట్టించుకోని పోలీసులు ,,సిపిఐ

పోరుమామిళ్ల పట్టణంలో మితిమీరుతున్న దొంగతనాలు, పట్టించుకోని పోలీసులు ,,సిపిఐ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) పోరుమామిళ్ల పట్టణంలో ఐదు నెలల నుండి ఏదో ఒక వీధిలో దొంగతనాలు జరుగుతు నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు దొంగల పట్ల చేస్తున్న తీరు చాలా బాధాకరమని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,నష్టపోయిన బాధితులతో విలేకరుల సమావేశం నిర్వహించారు.రెక్కడితే గాని,డొక్కాడని కార్మికులపై పోలీసుల నిర్లక్ష్యం తగునా సిపిఐఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలో ఐదు నెలల నుండి మోటార్ రివైండింగ్ షాపుల లో దొంగతనాలు,పాప్ కాన్ ఇంత యజమాని కరిముల్లా ఇంట్లో ఐదు లక్షల డబ్బులు,54 గ్రాముల బంగారం 22 తులాలు వెండి,చిల్లర అంగళ్లలో,ఎలక్ట్రికల్ షాపులు,టిఫిన్ సెంటర్లో,జగనన్న కాలనీలో మండలంలో చాలాచోట్ల, ట్రాన్స్ఫార్మర్లు,పగలగొట్టి దొంగతనాలు జరుగుతుంటే చూచి చూడనట్లు,పట్టీ పట్టనట్లు పోలీసులు చేస్తున్న తీరు చాలా బాధాకరమని పట్టణంలోని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.అలాగే అర్జీలు పోలీసు వారికి ఇచ్చిన,ఎలాంటి స్పందన లేదు,ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు గతంలో ఒకసారి దొంగలను పట్టుకొని వారిపై కేసులు నమోదు చేయకుండా,రెండు రోజులు స్టేషన్ పరిధిలో పెట్టుకొని,మళ్లీ వారిని విడిచిపెట్టిన పరిస్థితి,మొన్నకు మొన్న జగనన్న కాలనీలో,నరసింగపల్లి కమ్మవారిపల్లె,ఈ విధంగా మండలంలో చాలా గ్రామాల్లో ట్రాన్స్ ఫార్మర్లు,లో పగలగొట్టి దొంగతనం చేసే పరిస్థితి,రెండవసారి దొంగతనం చేయడానికి వెళ్లి తాళాలు పగలగొడుతుంది సీసీ కెమెరాల్లో పట్టుబడి వారిని పోలీసు వారికి అప్పజెప్పినప్పటికీ,వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసులు నమోదు చేయకుండా ఇంటికి పంపించిన పరిస్థితి,ఈ విధంగా దొంగలు దొంగతనాలు చేస్తుంటే పోలీసులు వారిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెడుతుంటే,పట్టణంలోని ప్రజలు పోలీసులు వెనక ఉండి దొంగతనాలు చేస్తున్నారేమో అని పలు అనుమానాలు బలంగా రేకెత్తించడం జరిగింది.గతంలో పోరుమామిళ్ల పట్టణంలో ఎన్నడు జరగని విధంగా దొంగతనాలు జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్లు పోలీసు వారు ఉండడం చాలా బాధాకరం,సిగ్గుచేటు అన్నారు.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వారే దొంగలుకు అండగా ఉంటే మాకు రక్షణ ఎవరూ అని పట్టణంలోని షాపు యజమానులు ఇంటి యజమానులు భయాందోళన చెందుతున్నారని ఈ తీరును మార్చుకొని ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా,నష్టపోయిన షాపు యజమానులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దొంగతనాలు జరిగిన బాధితులు కరిముల్లా,చెన్నారెడ్డి,రమణయ్య ఆంజనేయులు,భాష,మార్కెట్ రూములో అబ్దుల్ బాషా మహమ్మద్ హుస్సేన్,సిపిఐ నాయకులు పిడుగు పేరయ్య,చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular