ప్రజావాణి న్యూస్ (మే09) గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ.హనుమంతు.ఉచిత వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్,గుంటూరు,మాక్స్ విజన్ ఐ హాస్పిటల్.పలు రకాల మందులను ఉచితంగా అందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారు.ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పోలీస్ సిబ్బందికి వైద్య సేవలు అందించిన ఆసుపత్రుల యాజమాన్యాలను, డాక్టర్లను అభినందించి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ.గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్,గుంటూరు వారి సహకారంతో జిల్లా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని PGRS భవనం నందు”ఉచిత వైద్య శిబిరం“ను జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ హనుమంతు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్,గుంటూరు మరియు మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారు కార్డియాలజీ, జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్,గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆప్తమాలజీ,డెంటల్ మరియు ఈఎన్టీ వంటి పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి,పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్య సేవలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి BP,షుగర్ ECG,PFT,2D Echo BMD,HB తదితర వైద్య పరీక్షలు నిర్వహించి,పరీక్షల ఫలితాల ఆధారంగా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విలువైన సూచనలు అందించడంతో పాటు అవసరమైన మందులను సూచించడం జరిగింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం ఒత్తిడి అత్యవసర పరిస్థితులు మరియు కఠినమైన విధుల్లో పాల్గొంటూ ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అలాంటి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం జిల్లా ఎస్పీ గారు పోలీస్ సిబంది సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో సూచిస్తుంది.ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా పోలీస్ కుటుంబాల పట్ల ఎస్పీ చూపుతున్న శ్రద్ధ స్పష్టమవుతున్నది.
సమాజ హితం కోసం సేవలందిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు,డాక్టర్లు సూచించిన మందులను అవసరమైన పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అందించడం జరిగింది. ఈ సేవలు పోలీస్ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి.ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు ఆరోగ్య సంరక్షణ పట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారని తెలిపారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని,వారికి నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.ఆస్టర్ రమేష్ హాస్పిటల్,మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే వారు సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు.ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్య నిపుణులకు,ఆసుపత్రుల యాజమాన్యాలకు మరియు సేవా సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ తో పాటు వెల్ఫేర్ ఆర్ఐ సురేష్,ఆర్ఐ శ్రీహరి రెడ్డి, పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్,పోలీస్ అధికారులు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
RELATED ARTICLES

