📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసాగునీటి సమస్యను పరిష్కరించాలి

సాగునీటి సమస్యను పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

సాగునీటి సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు వినతి

బెజ్జంకి, మే 9(ప్రజావాణి )

ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో రైతు వారోత్సవాల్లో భాగంగా బెజ్జంకి మండల రైతులు సాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ఎండీ కరీంనగర్ అధికారులకు రైతులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా రైతులు తెలుపుతూ మండలంలోని రేగులపల్లి,పోతారం,చిల్లాపూర్,బెజ్జంకి, నరసింహులపల్లి, ముత్తన్నపేట,దాచారం,గుగ్గిళ్ళ, గాగిల్లాపూర్,తిమ్మాయిపల్లి,బెజ్జంకి క్రాసింగ్ గ్రామాలకు యాసంగి పంటల కోసం శనిగరం ప్రాజెక్టు నుండి సాగునీరు సరిగా అందడం లేదని రైతులు తెలిపారు.ఇరిగేషన్ ఫీడర్ కెనాల్స్‌లో ఉన్న సీల్డ్ తొలగించి కాలువలను పునరుద్ధరించాలని, రైతుల పొలాలకు నీరు సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పోతారం గ్రామ శివారులో ఉన్న పాత చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
శనిగరం కెనాల్ నుండి సైఫన్ పాయింట్ల నిర్మాణం, కొత్త చెక్‌డ్యామ్ల ఏర్పాటు, గ్రామాల చెరువుల తూముల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పించాలని రైతులు అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.