సాగునీటి సమస్యను పరిష్కరించాలి

సాగునీటి సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు వినతి బెజ్జంకి, మే 9(ప్రజావాణి ) ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో రైతు వారోత్సవాల్లో భాగంగా బెజ్జంకి మండల రైతులు సాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ఎండీ కరీంనగర్ అధికారులకు రైతులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా రైతులు తెలుపుతూ మండలంలోని రేగులపల్లి,పోతారం,చిల్లాపూర్,బెజ్జంకి, నరసింహులపల్లి, ముత్తన్నపేట,దాచారం,గుగ్గిళ్ళ, గాగిల్లాపూర్,తిమ్మాయిపల్లి,బెజ్జంకి క్రాసింగ్ గ్రామాలకు యాసంగి పంటల కోసం శనిగరం ప్రాజెక్టు నుండి సాగునీరు సరిగా అందడం లేదని రైతులు తెలిపారు.ఇరిగేషన్ ఫీడర్ కెనాల్స్‌లో ఉన్న...