📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి 90 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం,,వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ...

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి 90 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం,,వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్‌

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మే 07) అమ‌రావ‌తి సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి 90 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం జిల్లాల సమగ్ర పాలన,రియల్‌టైమ్ మానిటరింగ్,ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం జిల్లా క‌లెక్ట‌ర్ల మొద‌టి రోజు స‌మావేశంలో సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న వివ‌రాల్ని వివ‌రించిన‌ వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్‌ సింగపూర్ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సంస్కరణలకు వేగం పెంచేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడుకు అంద‌జేశామ‌ని వైద్యారోగ్య‌ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సింగపూర్ పర్యటనపై సమగ్ర నివేదికను ఆయ‌న‌ సమర్పించారు.సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ద్వారా విలువైన స‌మాచారాన్ని తెలుసుకోగ‌లిగామ‌ని,దీన్ని ఏపీలో అమ‌లు చేసే దిశ‌గా ముఖ్య‌మంత్రికి త‌మ అనుభ‌వాల్ని నివేదించామ‌ని మంత్రి తెలిపారు.సింగపూర్ పర్యటన.పరిపాలన,డిజిటల్ గవర్నెన్స్,శాఖల మ‌ధ్య‌ సమన్వయం ప్రజాకేంద్రీకృత సేవలపై విలువైన అవగాహన కల్పించిందని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల మంత్రివర్గ ప్రతినిధి బృందం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో విస్తృత స్థాయి అధ్యయనం నిర్వహించిందన్నారు.నిపుణుల నేతృత్వంలోని సమావేశాలు,మంత్రులతో చర్చలు,కేస్ స్టడీలు,సిమ్యులేషన్ వ్యాయామాలు,మౌలిక సదుపాయాల క్షేత్ర పర్యటనల ద్వారా పాలనా వ్యవస్థల అమలు తీరు ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు.దార్శనికతకు క్రమశిక్షణతో కూడిన కాలపరిమితి అమలు జతకట్టినప్పుడే పాలన ఫలిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం,విజన్ ఉన్నాయి.ఇప్పుడు అమలు యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని మంత్రి స్పష్టం చేశారు. సింగపూర్‌లో శాఖల మధ్య నిరంతర సమన్వయం,డేటా సమీకరణ,రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా ప్రజాసేవలు వేగంగా అందుతున్నాయని మంత్రి తెలిపారు.అక్కడి హోల్-ఆఫ్-గవర్నమెంట్ విధానం ఆధారంగా రాష్ట్రంలో కూడా సమగ్ర జిల్లా పాలన వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.ప్రభుత్వ గృహ నిర్మాణ కాలనీల్లో ఆరోగ్య సేవలు,క్రీడా మైదానాలు,గ్రంథాలయాలు,ఆహార కేంద్రాలు,పౌర సేవలను ఏకీకృతం చేసిన కమ్యూనిటీ మౌలిక సదుపాయాల నమూనా ప్రతినిధి బృందాన్ని ఆకట్టుకుందని పేర్కొన్నారు.జురాంగ్ పోర్టు,ఆటోమేటెడ్ వ్యవస్థల పరిశీలన సింగపూర్‌లోని జురాంగ్ పారిశ్రామిక ప్రాంతం,ప్రపంచంలోనే అతిపెద్ద స్వయంచాలిత ఓడరేవులలో ఒకదాన్ని సందర్శించినట్లు మంత్రి తెలిపారు.అక్కడ కంటైనర్ రవాణా,లాజిస్టిక్స్ కార్యకలాపాలు స్వయంప్రతిపత్తి వ్యవస్థలు,కేంద్రీకృత కమాండ్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న తీరు అధ్యయనం చేసినట్లు చెప్పారు వాతావరణ మార్పులు,విపత్తు నిర్వహణపై దృష్టివాతావరణ మార్పులను తట్టుకునే పట్టణ ప్రణాళిక,నీటి నిర్వహణ,వరద నియంత్రణ,పచ్చదనం వంటి కార్యక్రమాలు సింగపూర్ ప్రత్యేకతగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. మహమ్మారి వంటి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు అనుస‌రించాల్సిన విధానాలు,అత్యవసర సన్నద్ధత,సాంకేతికత ఆధారిత పాలనపై అక్కడి అనుభవాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు.కోవిడ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి,భారీ టీకా కార్యక్రమాలు,ఇతర దేశాలకు వైద్య సహాయం అందించిన భారత అనుభవాన్ని కూడా ప్రతినిధి బృందం సింగపూర్ అధికారులతో పంచుకున్నట్లు చెప్పారు.90 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లో ప్రధానాంశాలు సమగ్ర జిల్లా పాలన,రియల్‌టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలు,పౌర అభిప్రాయ సేకరణ యంత్రాంగాలు,ఏకీకృత ఫిర్యాదు పరిష్కార వేదికలు,శాఖల మధ్య సమన్వయం,డిజిటల్ ఆరోగ్య సేవలు,విపత్తు నిర్వహణ,సైబర్ నేరాల నియంత్రణ,సహజ వ్యవసాయ ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.సింగపూర్ పరిమాణం,జనాభా ఆంధ్రప్రదేశ్‌తో భిన్నమైనప్పటికీ,అక్కడి ఉత్తమ పాలనా విధానాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా అనుసరిస్తే రాష్ట్రంలో ప్రజాసేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular