
నంద్యాల జిల్లా,ప్రజావాణి న్యూస్ (మే06) బనగానపల్లె తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటున్న ఎమ్మార్వో, సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గాపట్టుకున్నారు.బనగానపల్లె పట్టణంలోని కోనాపురం నారాయణరెడ్డి 121 సర్వే నెంబర్ చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చడానికి బనగానపల్లె కరెంట్ ఆఫీస్ దగ్గర 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తొలుత మండల సర్వేయర్ హుస్సేన్ భాష పట్టుబడ్డారు.తర్వాత ఆయనతో నేరుగా బనగానపల్లె తాసిల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయించారు. ఈ క్రమంలో ఆ 50,000 డబ్బులు తీసుకుని ఆఫీసుకి రావాలని ఎంఆర్ఓ సూచించారు. దీంతో సర్వేయర్‌ను తీసుకుని ఆఫీసుకి వెళ్ళిన ఏసీబీ డిఎస్పి సోమన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

