📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకిలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర

బెజ్జంకిలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, మే 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో సోమవారం హనుమాన్ శోభాయాత్రను హనుమాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్టించి, “జై హనుమాన్” నినాదాలు, భజనల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.మహిళలు మంగళహారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ శోభాయాత్రలో గ్రామ ప్రజలు, యువకులు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular