ఘట్కేసర్, మే 2 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఘట్కేసర్ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ ఎమ్మార్వో చంద్రశేఖర్ తదితరులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




