ఐ ఎన్ టి యు సి మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
మందమర్రి, (మన ప్రజావాణి) మే 01:
ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి ,రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మందమర్రి పట్టణ ఐఎన్టియుసి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమీపంలో మేడే వేడుకలను ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు వడ్లకొండ రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐ ఎన్ టి యు సి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ 1886వ సంవత్సరంలో చికాగోలో జరిగిన ఉద్యమ ఫలితంగా మేడే ఆవిష్కరణ జరిగిందని 16 గంటల పని విధానానికి వ్యతిరేకంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి నేడు ప్రపంచ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని ఆవలంబింపజేసిన ఘనత ఆనాటి చికాగో అమరవీరులదని అన్నారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండల చైర్మన్ బి .జనక్ ప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 25 లక్షల మంది అసంఘటితరంగా కార్మికుల శ్రేయస్సు కోసం, వారికి కనీస వేతనాలు కోసం, ఆరోగ్య భద్రత కోసం కృషి చేస్తున్నారని, అసంఘటితరంగా ఉద్యోగులకు త్వరలోనే న్యాయం జరగబోతున్నదన అందులో భాగంగానే క్యాబ్,
గిగ్ వర్కర్ల సంక్షేమం కొరకు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టం వలన లక్షలాదిమంది జాబ్
గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు, ప్రమాద బీమా వర్తింపు, ఆరోగ్య భద్రత లభించే అవకాశం వచ్చిందని ఇదే విధానాన్ని అన్ని తరహా అసంఘటితరంగ కార్మికా రంగాలకు వర్తింపజేసడానికి వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారతదేశ కార్మిక రంగాన్ని అవమానిస్తున్నారని మహాత్మా గాంధీ జాతీయ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీం పేరు మార్చి మహాత్మా గాంధీని పేరుని చేర్పివేశారని, పని గంటలను కూడా కుదించి గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు పని లేకుండా చేశారని, నిధులను కూడా తగ్గించేశారని ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న మోడీ సర్కార్కు దేశ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఉద్యమ కార్యచరణను రూపొందిస్తున్నారని 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికుల ఉద్యోగ భద్రతను కనీస వసతులను హరించేలా, సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయేలా పిఎఫ్, పెన్షన్ వంటి సౌకర్యాలను తీసివేసేలా, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేలా ఆ చట్టాలను రూపొందించారని, ఈ చట్టాల రద్దు కోసం ఉద్యమం తప్పదని అన్నారు. అనంతరం మందమర్రి పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు వడ్లకొండ రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ ఆటో కార్మికుడు రాజేశం చేత మే డే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య , ఈదునూరి బాపూ,శివ, అగర్వాల్, శ్రీనివాస్, రాకేష్, జమీల్ ఖాన్, రాజేశం,మహేందర్, కాంట్రాక్టు కార్మికులు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మే”డే” జండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
ఐ ఎన్ టి యు సి మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
RELATED ARTICLES

