ఐ ఎన్ టి యు సి మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

ఐ ఎన్ టి యు సి మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలుమందమర్రి, (మన ప్రజావాణి) మే 01:ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి ,రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్  ఆదేశాల మేరకు శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మందమర్రి పట్టణ ఐఎన్టియుసి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమీపంలో మేడే వేడుకలను ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు వడ్లకొండ రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ...