బెజ్జంకి,ఏప్రిల్ 29 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తిప్పరవేణి రాజయ్య ఇటీవల చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.బుధవారం మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పోచయ్య, బైర సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పరవేణి బాబు, బీసీ సెల్ అధ్యక్షులు తులిశాల శేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైల బాలయ్య, బోయిని రాజు, కొంకటి రాజయ్య, చిట్టి గంగయ్య, తిప్పరవేణి చంద్రయ్య, రాజు పోచయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు బోయిని ప్రశాంత్, రేవోజు శేఖర్, సుదమల్ల ప్రశాంత్, కొండా శరత్, చెప్యాల మహేష్, విశ్వనాథం, సత్యనారాయణ, చెప్యాల నాగరాజ్, చిట్టి పవన్ తదితరులు పాల్గొన్నారు.




