📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetపదవ తరగతి ఫలితాల్లో గ్రామీణ విద్యార్థుల ప్రతిభ :-

పదవ తరగతి ఫలితాల్లో గ్రామీణ విద్యార్థుల ప్రతిభ :-

📰 Generate e-Paper Clip

పదవ తరగతి ఫలితాల్లో గ్రామీణ విద్యార్థుల ప్రతిభ :-

👉 శ్రీ వెంకటేశ్వర విద్యా నిలయంలో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది .

👉546/600 మార్కులు ఒక సంచలనం.

👉 పాఠశాలలో మిన్నటిన సంబరాలు.

👉హర్షం వ్యక్తం చేసిన యాజమాన్యం..

ప్రజావాణి ఏప్రిల్ 29:సూర్యాపేట జిల్లా,మోతే మండలం, మామిళ్లగూడెం గ్రామం లో

నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో,
శ్రీ వెంకటేశ్వర విద్యాలయం పాఠశాల మామిల్లగూడెం విద్యార్థులు మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు కైవసం చేసుకున్నారు.

రాంపురం తండా గ్రామానికి చెందిన ధరావత్ నవీన్ నాయక్ అనే విద్యార్థి 546 /600 మార్కులు కైవసం చేసుకున్నాడు.

పాఠశాలలో సుమారుగా 10 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారు. వారి వివరాలు షేరు పూజిత 527 మార్కులు, భూక్యా కార్తీక్ 527 మార్కులు, జాన్ పాల్ 517 మార్కులు, శ్రీనిధి 516, శ్యామ్ ప్రసాద్ 509 మార్కులు, సాధించడం జరిగింది.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన రీతులో తర్ఫీదు ఇచ్చి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే తమ పాఠశాల యొక్క లక్ష్యం అని పాఠశాల కరస్పాండెంట్ గా జానిమియా గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం పరీక్ష రాసిన 25 మంది విద్యార్థులకు గాను 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉందని కరస్పాండెంట్ జానిమియా గారు తెలియజేశారు.

పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అబ్దుల్ ఆజాద్ గారు మాట్లాడుతూ కేవలం 10వ తరగతి ఫలితాల్లోనే కాదని, ఈ విద్యా సంవత్సరం మన పాఠశాల నుంచి 24 నవోదయ సీట్లు, అలాగే తొమ్మిది మంది ఆల్ ఇండియా సైనిక్ సీట్లు సాధించి వివిధ రాష్ట్రాలకు ఎంపికయ్యారని, సుమారుగా 30 మంది విద్యార్థులు స్టేట్ సైనిక్ రుక్మాపూర్, జగద్గిరిగుట్ట, ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కి ఎంపిక అయ్యారని, అన్ని విధాలుగా పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలియజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సఫియా మహమ్మద్ మాట్లాడుతూ ఈ గెలుపుకి కారణమై ఈ విజయాన్ని పొందిన విద్యార్థులను అభినందిస్తూ, శ్రమించిన ఉపాధ్యాయ బృందానికి, సహకరించిన తల్లిదండ్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

మండల స్థాయిలో ఉత్తమమైన మార్కులు సాధించినందుకు గాను ధరావత్ నవీన్ నాయక్ అనే విద్యార్థిని శాలువా తో సన్మానించి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సయ్యద్ మియా, ఉపాధ్యాయులు వేముల రమేష్, గజ్జి సైదులు, షైక్ చాంద్ పాషా, నవ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular