సెయింట్ విన్సెంట్ పాఠశాల 10వ ఫలిత
బెజ్జంకి, ఏప్రిల్ 29 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ పరిధిలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 44 మంది విద్యార్థుల్లో 43 మంది 500 పైగా మార్కులు సాధించడం విశేషం.
విద్యార్థిని వైష్ణవి 577 మార్కులతో మండలంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, నౌమిత 575 మార్కులు, మణిచందన 573 మార్కులు సాధించారు. రోహిత్, సహస్రలు 572 మార్కులు, రుద్రంబికా 570 మార్కులతో ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ఫ్యూలా మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.




