📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగిరి ప్రదర్శనకు సిద్ధమైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

గిరి ప్రదర్శనకు సిద్ధమైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఏప్రిల్ 29 (ప్రజావాణి)

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏకశిలా గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 30న (గురువారం) గిరి ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందేందుకు వస్తారని భావిస్తూ తాగునీరు, విద్యుత్, పారిశుధ్య ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులు క్రమశిక్షణ పాటించాలని, ఆలయ నియమాలను అనుసరించాలని నిర్వాహకులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular