📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagar“పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత”

“పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత”

📰 Generate e-Paper Clip

ఐసీడీఎస్ సూపర్వైజర్  వెంకటలక్ష్మి

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల క్రమంలో పోరండ్ల అంగన్వాడి కేంద్రంలో “బాలల భద్రత వారోత్సవాలు” ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.పోరండ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిశోర్ బాలికలకు బాలల భద్రత, ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, సైబర్ భద్రత వంటి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అదేవిధంగా బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విశదీకరించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం అందుబాటులో ఉన్న 1098 చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ గురించి వివరించి, అవసరమైనప్పుడు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిల్లల భద్రత ప్రతి కుటుంబం, సమాజం బాధ్యత. పిల్లలపై ఏదైనా అన్యాయం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందించడం అత్యంత అవసరం. బాలికలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓదెలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా వర్కర్లు, వీవోలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తల్లులు మరియు కిశోర్ బాలికలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular