📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య.. పోరుమామిళ్లలో జర్నలిస్టుల నిరసన, ప్రత్యేక రక్షణ చట్టం...

జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య.. పోరుమామిళ్లలో జర్నలిస్టుల నిరసన, ప్రత్యేక రక్షణ చట్టం డిమాండ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా.ప్రజావాణి (ఏప్రిల్28) పోరుమామిళ్ల,చిత్తూరు జిల్లాకు చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అతికిరాతకంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణాన్ని ఖండిస్తూ మంగళవారం కడప జిల్లా పోరుమామిళ్లలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.స్థానిక గాంధీబొమ్మ నుంచి పోలీస్ స్టేషన్ వరకు జర్నలిస్టుల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. “జర్నలిస్టుల హత్యలు ఆపండి వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడండి“నిందితులను కఠినంగా శిక్షించండి” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.అనంతరం పోరుమామిళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హేమ సుందర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, వారిపై హత్యానేరంతో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.రాష్ట్రంలో వరుసగా జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మమ్మల్ని టార్గెట్ చేసి అతి కిరాతకంగా చంపేస్తుంటే ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించడం సరికాదు”అని మండిపడ్డారు.జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని,దాడులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరారు.జగన్మోహన్ రెడ్డి మృతికి సంతాపంగా జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.