జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య.. పోరుమామిళ్లలో జర్నలిస్టుల నిరసన, ప్రత్యేక రక్షణ చట్టం డిమాండ్
కడప జిల్లా.ప్రజావాణి (ఏప్రిల్28) పోరుమామిళ్ల,చిత్తూరు జిల్లాకు చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అతికిరాతకంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణాన్ని ఖండిస్తూ మంగళవారం కడప జిల్లా పోరుమామిళ్లలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.స్థానిక గాంధీబొమ్మ నుంచి పోలీస్ స్టేషన్ వరకు జర్నలిస్టుల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. "జర్నలిస్టుల హత్యలు ఆపండి వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడండి"నిందితులను కఠినంగా శిక్షించండి" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.అనంతరం...