📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriసమ్మర్ క్యాంప్‌కు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

సమ్మర్ క్యాంప్‌కు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి):     మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం వార్డులోని  అన్నోజిగూడ లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంప్‌కు అవసరమైన క్రీడా సామగ్రిని రేవంత్ టీం సభ్యుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం సీఐ కనకయ్య గౌడ్, షీ టీం సీఐ అంజయ్య, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మర్ క్యాంప్ కోసం క్రీడా సామగ్రిని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్యాంప్ ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనురాధ టీచర్, పీఈటీ విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular