సమ్మర్ క్యాంప్‌కు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
ఘట్‌కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం వార్డులోని అన్నోజిగూడ లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంప్‌కు అవసరమైన క్రీడా సామగ్రిని రేవంత్ టీం సభ్యుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం సీఐ కనకయ్య గౌడ్, షీ టీం సీఐ అంజయ్య, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మర్ క్యాంప్ కోసం క్రీడా సామగ్రిని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు....