తిరుమలాయపాలెం, ప్రజావాణి:
అనుమతి లేకుండా నడుస్తున్న కాకరవాయి శ్రీరామ విద్యాలయం మూసివేత.
మలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీరామ విద్యాలయంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీ ఎం. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలను మూసివేయించడం జరిగింది.వివరాల ప్రకారం, సంబంధిత పాఠశాల అనుమతులు లేకుండా నడుస్తున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో వెంటనే పరిశీలన చేపట్టారు. పరిశీలనలో పాఠశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు పాఠశాలలోని అన్ని రికార్డులు, అడ్మిషన్ వివరాలు, ఇతర సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల హ్యాండ్ ఓవర్ ప్రక్రియను పూర్తిచేసి, పాఠశాలను తక్షణమే మూసివేశారు.ఈ ఘటనతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నడపకూడదని, నిబంధనలు తప్ప
RELATED ARTICLES

నిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ చర్యలో స్థానిక విద్యాశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.